calender_icon.png 30 April, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంపింగ్ యార్డ్ తరలింపు కోసం వరసిద్ధి కాలనీవాసుల నిరసన

28-04-2025 02:06:36 AM

 కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 27:  నగరంలోని కోతిరాంపూర్ 9వ డివిజన్ శ్రీ వరసిద్ధి వినాయక కాలనీ వాసులు డంపింగ్ యార్డ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం  నిరసన కార్యక్రమం చేపట్టారు. వరసిద్ధి వినాయక కాలని నుండి కోతిరాంపూర్ చౌరస్తా వరకు  శాంతియుత ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ రాంపూర్ ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిందన్నారు. ప్రభుత్వం , జిల్లా యంత్రాంగం,  మున్సిపాలిటీ అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ తొలగించడానికి చర్యలు చేపట్టాలని , లేకపోతే తమ పోరాటాన్ని  తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక కాలనీ అధ్యక్షులు నా రెడ్డి గుణిందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొద్దుల జగదీష్, ప్రధాన కార్యదర్శి బండిపల్లి పరశురాములు,  రామన్న,  ఇజ్జగిరి శ్రీనివాస్, గంటా మోహన్ రెడ్డి, హరి మోహన్, మాజీ కార్పొరేటర్ లెక్కల వేణు, విజ్ఞాన్ శ్రీనివాస్, బిజెపి ఈస్ట్ జోన్ ప్రధాన కార్యదర్శి మాసం గణేష్, డివిజన్ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.