22-10-2024 01:06:52 AM
హైదరాబాద్: వరాస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ ర్యాపిడ్ ఓపెన్ రేటింగ్ చెస్ టో ర్నీలో యువ చెస్ కెరటం ధ్రువ తోట చాంపియన్‌గా నిలిచాడు. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన టోర్నీలో ధ్రువ 8.5 పాయింట్లు సాధించి తొలి స్థానంలో నిలిచి ట్రోఫీతో పాటు 30వేల నజరానా అందుకున్నాడు.
రెండో స్థానంలో నిలిచిన ప్రణయ్ ఆకుల రూ. 20 వేలు, మూడో స్థానంలో నిలిచి కౌస్తువ్ కుందు రూ. 15 వేల నగదు అందుకున్నారు. మొత్తం 494 మంది ఆటగాళ్లు పాల్గొనగా.. ఆయా కేటగిరీల్లో విజేతలుగా నిలిచిన 98 మందికి 3 లక్షలు క్యాష్‌ప్రైజ్‌గా అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కొండా విశ్వేశర్‌రెడ్డి విజేత లకు ప్రైజ్‌మనీ అందించి అభినందనలు తెలిపారు.