calender_icon.png 24 October, 2024 | 4:07 AM

దాంపత్య జీవితంలోకి వరలక్ష్మి

12-07-2024 12:05:00 AM

తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. ఇటీవల చెన్నైలో ప్రీ వెడ్డింగ్, మెహందీ  వేడుక నిర్వహించినప్పటికీ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేది మాత్రం రహస్యంగా ఉంచారు. కాగా, వరలక్ష్మి వివాహ వేడుక థాయ్‌లాండ్‌లోని క్రాబీ ప్రాంతంలోని బీచ్‌లో ఉన్న ఓ రిసార్ట్‌లో బుధవారం జరిగింది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టగా, శరత్ కుమార్ దంపతులతోపాటు పలువు రు సినీ ప్రముఖులు, ఇతర రంగాల వారు నూతన దంపతులను ఆశీర్వదించారు.