calender_icon.png 3 October, 2024 | 10:48 PM

సనాతనధర్మానికి రంగు, వివక్ష లేదు..

03-10-2024 07:56:18 PM

అమరావతి,(విజయక్రాంతి): తిరుపతిలో వారాహి బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వెంకటేశ్వరస్వామి, తను సనాతనధర్మాన్ని పాటిస్తే, తన ప్రాయశ్చిత్త దీక్షను కూడ  అవహేళన చేసి మాట్లాడారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటాను, ఈ మధ్య దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు జరుగుతుంటే మన పళ్లబిగువున బాధను భరించాలా?, హిందూ సమాజంలో ఐక్యత లేకపోవడమే దీనికి కారణం అని విమర్శించారు.

హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారని, హిందువులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. హిందూమతం గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితికి వచ్చామని, రాముడిని తిడితే నోరెత్తకూడదు.. మనది లౌకికవాద దేశం అంటారు కాదా..?, ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిడితే వదిలేస్తారా..?, హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదా..? అని ఏపీ డిప్యూటి సీఎం ప్రశ్నించారు. సెక్యులరిజం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని, సనాతన ధర్మాన్ని సూడో సెక్యులరిస్టులు విమర్శిస్తున్నారు.

సనాతనధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించేవారు ఎక్కువయ్యారంటూ చురకలు అంటించారు. ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవు, బంగ్లాదేశ్.. ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకుంటే ఎవరూ మాట్లాడరు. సనాతనధర్మానికి రంగు, వివక్ష లేదు.. మెకాలే తీసుకువచ్చిన వివక్ష ఇదంతా అని పవన్ హేళన చేశారు. సనాతన ధర్మానికి హాని తలపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.