calender_icon.png 23 December, 2024 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువునే మాయం జేస్తుండ్రు!

09-09-2024 01:02:32 AM

  1. గంగోనికుంట, గొలుసుకట్టు  కాలువలపై రియల్ దొంగల నజర్ 
  2. కోట్ల విలువైన భూములు స్వాహా 
  3. ఉన్నతాధికారులు పట్టించుకోవాలని ప్రజల విజ్ఞప్తి 

కరీంనగర్, సెప్టెంబరు ౮ (విజయక్రాంతి): ఒకప్పడు హుజూరాబాద్ చుట్టూ చెరువులు, వాగులు, కాలువలతో పల్లెటూరు వాతవరణం తలపించేలా ఉండేది. చెరువులపైనే ఆధారపడి వందలాటి కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. చెరువులపై ఆధారపడి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నో కుటుంబాలు జీవించేవి. కాలక్రమేనా కొంతమంది బడా నాయకుల పుణ్యంతో చెరువులు కొద్దికొద్దిగా కబ్జాకు గురవడం మొదలైంది. ఇందు కు ప్రత్యక్ష నిదర్శనం హుజూరాబాద్ పట్టణంలోని మోడల్ చెరువు. ఈ చెరువు పావు లా వంతు కబ్జాదారుల కబంధహస్తాల్లోకి ఇప్పటికే వెళ్లడం తీవ్ర ఆందోళన కల్గిస్తున్నది.

గతంలో మోడల్ చెరువు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కబ్జాదారులు, కొందరు రియల్ ఎస్టేట్ దొంగలవల్ల దాదాపు 40 ఎకరాలు కబ్జాకు గురైందని తెలుస్తోంది. ఈ చెరువు నుంచి గుండ్లె చెరువుకు నీటిని తీసుకువెళ్లే గొలుసుకట్టు కాలువలతోపాటు చిన్న కాలువలు, నాలాలు, కల్వర్టులు సైతం కబ్జా చేసి రియల్టర్లు యథేచ్ఛగా దందా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా సర్వే నంబర్ 2477 గంగోనికుంట మొత్తం విస్తీర్ణం 12.16 ఎకరాలుగా ఉంది.

ఇందులోనూ ఇప్పటి కే 7 ఎకరాల వరకు కబ్జాకు గురైం ది. ప్రస్తుతం ఐదెకరాల విస్తీర్ణంలో మాత్రమే ఈ కుంట కుదించుకుపోయింది.  కుంట కింద సుమా రు 150 ఎకరాల వరకు సాగుయ్యేది.  ప్రసుతం హుజూరాబాద్ లోని డ్రైనేజీ వాటర్ ఈ కుంటలోకి వెళ్లడంతో వ్యవసాయానికి కూడా ఆ నీరు పనికిరాకుండా మారిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తూములను వదల్లే

గంగోనికుంట, మోడల్ చెరువు, బట్టోని కుంట, చంద్రవోని కుంట, తదితర గొలుసుకట్టు చెరువులు, కుంటలను, కట్టు కాలువ లు, ఆఖరికీ తూములను సైతం కబ్జారాయు ళ్లు వదిలిపెట్టలేదు. కట్టు కాలువలను మూసిసి ఫ్లాట్లను ఏర్పాటు చేశారు. బట్టోనికుంట, గం గోనికుంట, మోడల్ చెరు వు, చంద్రవానికుంటల ప రిస్థితి మరి దయనీయంగా మారి ంది. శిఖం భూముల ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంకు లెవ ల్) దాటిపోయి కుంటలు, చెరువుల గర్భం వరకు ఆక్రమించి న ఆనవాళ్లు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. కుంటలు, చెరువుల్లో పదుల ఎకరాల్లో భూములను ఆక్రమి ంచారు. కట్టు కాలువలు, తూములను సైతం వదల్లేదు. ఎఫ్‌టీఎల్ దాటడమే కాకుండా కట్టు కాలువలను సైతం వెంచర్లలో కలుపున్నారు.

బట్టోనికుంట, గంగోని కుంట క్రమం గా మూసేస్తున్నారు. అధికారులకు పలుప ర్యాయాలు సమస్యలపై పత్రాలు అందించినప్ప టికీ తూతూ మంత్రంగా పర్యవేక్షించి వె ళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం చూపలేకపోతుఆన్నరని ప్రజలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. కబ్జాల వెనుక రాజకీయ నా యకుల అండదండలు ఉండటంతోపాటు హుజూరాబాద్‌లో ప్రభుత్వ భూముల కబ్జా లో చాలావరకు ప్రజాప్రతినిధులే ఉండటం తో కబ్జాదారులపై ఫిర్యాదులు చేసిన వృథానే అవుతుందని చెప్తున్నారు.

హుజూరాబాద్ కు వచ్చే వాగుకు సైతం అడ్డుకట్ట వేసి వాగు ప్రవహించే ప్రాంతాన్ని సైతం క బ్జా చేసిన కే టుగాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ము రుగునీరు ప్రవహించే కాలువలు సైతం కబ్జా చేయడంతో మురుగునీరు రోడ్లపైకి ప్రవహి ంచడం పరిపాటిగా మారింది. దాదాపు హు జూరాబాద్ పట్టణంలోనే వం దల ఎకరాలు కబ్జాకు గురయింది అనేది మాత్రం తేటతెల్లమయింది. మోడల్ చెరువు, గంగోనికుంట ఈ రెండింటిలోనే దాదాపు 50 ఎకరాల వరకు కబ్జాకు గురైనట్టు తెలుస్తుంది. 

కళ్లుండీ చర్యలు తీసుకోని అధికారులు

హుజూరాబాద్‌లో ఆక్రమణదారులను గుర్తిస్తున్నా, కబ్జా అయిందని నిర్ధారణ చేసుకున్నా అధికారులు వారిపై ఎలాంటి చర్య లు తీసుకోవడం లేదు. టౌన్ ప్లానింగ్, రెవె న్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేదు. దీంతో అక్రమార్కులు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. ఆరంభ సమయంలోనే నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడంలేదనే ఆరోపణలున్నాయి. చెరువులు, కుంటల పూర్తిస్థాయి నీటిమట్టం పరిధిని నిర్ధేశించకుండా జాప్యంచే స్తుండటమే కబ్జాలకు  కారణమవుతున్నట్టు తెలుస్తుంది. పూర్తిస్థాయి విచారణ జరిపిస్తేనే హుజూరాబాద్ లో ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు క బ్జా జరిగిందో తెలిసే అవకాశం ఉంది. కబ్జాదారుల భరతం పట్టాలని పలువురు ప్రజలు కోరుకుంటున్నారు. 

కబ్జాలు మామూలు అయిపోయాయి

హుజూరాబాద్‌లో కుంటలు, చెరువులు, కట్టు కాలువలు, తూములు కబ్జా చేయడం మాములు అయిపోయింది. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. నేను గత కొన్ని ఏళ్లుగా కుంటల కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా. వారు తూతూ మంత్రంగా విచారణ చేసి వదిలేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టేస్తూ పట్టించుకోవడం లేదు. కళ్లముందు కబ్జా చేసి కట్టడాలు నిర్మించినా.. ఏ ఒక్కరిని ఆపలేదు. కట్టిన వాటిని కూల్చలేదు. పైగా కబ్జాదారుల వద్ద డబ్బులు దండుకుంటున్నారు.  

కొలిపాక సమ్మయ్య, ముదిరాజ్ సంఘం నాయకుడు