calender_icon.png 5 January, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందే భారత్ ట్రైన్ కు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలి

14-09-2024 01:33:56 PM

సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

మంచిర్యాల, విజయ క్రాంతి : వందే భారత్ రైలు మంచిర్యాల స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోరారు. శని వారం మంచిర్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, మంచిర్యాలను ఆనుకుని ఉన్న పారిశ్రామిక ప్రాంతం ప్రజల, అధికారుల సౌకర్యార్థం వందే భారత్ ట్రైన్ కు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బిజెపి నాయకులు, బిజెపి రైల్వే మినిస్టర్లను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారని, వడ్డించే వాడే ఆకలి అన్నట్టు ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. కేంద్ర ప్రభుత్వం బిజెపి ది, మీరు విన్నపాలు చేయడం హాస్యాస్పదమన్నారు. మంచిర్యాలను ఆనుకొని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP), సింగరేణి సంస్థ ప్రజలు, అధికారులు, వివిధ ప్రాంతాలకు సునయాసంగా పోయేందుకు ఈ ట్రైన్ ఉపయోగపడుతుందన్నారు.  ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మంచిర్యాల జిల్లా కేంద్రంలో హాల్టింగ్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టీ యు సీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సీ పీ ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఖలిందర్ ఆలీ ఖాన్, జోగుల మల్లయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, దేవి పోచన్న, కుంచాల శంకరయ్య, కోడి వెంకటేశం, నాయకులు రాయమల్లు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.