calender_icon.png 31 October, 2024 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనపర్తి ఆబ్కారీ సూపరింటెండెంట్‌పై వేటు

31-10-2024 12:52:22 AM

సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు 

వనపర్తి, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ఆఫీసుకు రాకుండా ఇంటి నుంచే ‘అక్రమ’ వ్యవహారాలు నడిపించిన వనపర్తి ఆబ్కారీ సూపరింటెండెం ట్‌పై అధికారులు వేటు వేశారు. సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ బుధవారం ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సార్ రారు.. ఇంటికే ఫైల్స్’ శీర్షికతో గత నెల ౨౭న విజయక్రాంతిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. సదరు అధికారి తతంగంపై గోప్యంగా విచారణ జరిపించారు.

కానీ, ఆయనపై వేటు వేసేందుకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఈ నెల 22న ‘పొరుగు సేవలకే ఆబ్కారి మొగ్గు’ పేరిట విజయక్రాంతి మరో కథనాన్ని ప్రచురించడంతో ఎట్టకేలకు వనపర్తి జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ప్రభు వినయ్‌పై వేటుపడింది.

బుధవారం సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు.మహబూబ్‌నగర్ అదనపు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బీ శ్రీనివాస్‌కు వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.