calender_icon.png 23 September, 2024 | 12:56 PM

క్రీడారంగంలో వనపర్తికి సింహభాగం

25-07-2024 02:02:02 AM

రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి

వనపర్తి, జూలై 24(విజయక్రాంతి): వనపర్తిని విద్యతో పాటు క్రీడారంగంలో ముం దువరుసలో ఉంచేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు క్రీడా పాఠశాలలు హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్‌లో ఉన్నాయని.. ౪వ పాఠశాలను వనపర్తిలో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక హాకీ అకాడమీ వనపర్తిలోనే ఉందని.. ఇక్కడ కావాల్సిన వసతు లన్నింటీనీ కల్పిస్తామన్నారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా కేంద్రానికి స్పోర్ట్స్ పాఠశాలతో పాటు పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వాకర్స్ కోసం పాలిథిన్ వాకింగ్‌ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డికి వినతిపత్రం అందించారు. అలాగే స్థానిక మైదానాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మహేష్, వైస్ చైర్మన్ కృష్ణయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.