calender_icon.png 23 September, 2024 | 7:56 AM

లక్ష్యానికి చేరువలో వనమహోత్సవం

23-09-2024 01:08:55 AM

ఈ ఏడాది 20.02 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం 

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ మినహా.. మిగతా జిల్లాల్లో 95 శాతం లక్ష్యం పూర్తి

13 జిల్లాల్లో వందశాతం దాటిన ప్లాంటేషన్ 

టాప్‌లో కామారెడ్డి, చివరి స్థానంలో వనపర్తి   

హైదరాబాద్, సెప్టెంబర్ 2౨ (విజయక్రాంతి): పర్యావరణాన్ని పెంపొందించేందు కు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 20.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. మొక్క లు నాటే కార్యక్రమంలో అటవీశాఖతో పాటు పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు.. హెచ్‌ఎండీఏ, జీహెచ్ ఎంసీలను రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది.

అక్టోబర్ చివరి నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని, 20 కోట్ల మొక్కల ప్లాంటేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం అటవీశాఖను ఆదేశించింది. అటవీశాఖ మాత్రం ఈ నెల 31 వరకు లక్ష్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 15.134 కోట్ల మొక్కలు నాటారు. నిర్ధేశిత లక్ష్యంలో 76. 63 శాతం పని పూర్తయింది. అయితే గ్రేటర్ హైదరాబాద్, హెచ్‌ఎండీ ఏరియాలో ఏడాది మొత్తం మొక్కలు నాటను న్నారు.  జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ మినహా మిగతా జిల్లాల్లో దాదాపు 95 శాతం మొక్క లు నాటడం పూర్తుంది.

ఈ నెలాఖరుకు లక్ష్యానికి చేరుకుంటామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 26.471 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా 32.243 లక్షల మొక్కలు నాటా రు. అదనంగా 8 లక్షల మొక్కలు నాటి 121.81 శాతంతో ఆ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వనపర్తిలో 18.392 లక్షల మొక్క లు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 14.219 లక్షల మొక్కలే నాటారు. దీంతో ఆ జిల్లా 77.31 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాలకుగా నూ 13 జిల్లాల్లో వందశాతానిక పైగా ప్లాంటేషన్ పూర్తయింది.

జిల్లాల వారీగా వివరాలు

జిల్లా లక్ష్యం (లక్షల్లో) నాటిన మొక్కలు (లక్షల్లో) శాతం

కామారెడ్డి 26.471 32.243 121.81   

నారాయణపేట 11.500 13.208 114.86

ఖమ్మం 31.060 34.135 109.90            

రాజన్న సిరిసిల్ల 7.591 8.298 109.31

భద్రాద్రి కొత్తగూడెం 65.738 70.082 106.61

పెద్దపల్లి 27.008 28.184 104.35

జనగామ 26.278 27.222 103.59

మెదక్ 34.082 34.066 101.71

వరంగల్ 25.583 25.856 101.06

సంగారెడ్డి 35.880 36.030 100.42  

హనుమకొండ 17.187 17.248 100.35

మేడ్చల్  మల్కాజిగిరి 63.700 63.787 100.14

మహబూబాబాద్ 46.745 46.745 100.00

నల్లగొండ 66.062 64.920 98.27

ఆసిఫాబాద్ 53.207 52.024 97.78

నిర్మల్ 58.757 56.881 96.81

కరీంనగర్ 43.476 42.063 96.75

నిజామాబాద్ 46.061 40.574 96.46

నాగర్‌కర్నూల్ 40.907 39.174 95.76

గద్వాల 15.095 14.388 95.30

మంచిర్యాల 45.045 42.191 93.67

మహబూబ్‌నగర్ 55.248 51.412 93.06

రంగారెడ్డి 82.498 75.803 91.88

ఆదిలాబాద్ 44.169 40.568 91.85

సూర్యాపేట 53.452 48.766 91.23

యాదాద్రి 17.447 15.716 90.08

సిద్దిపేట 21.626 19.399 89.70          

భూపాలపల్లి 26.129 23.139 85.56

జగిత్యాల 46.067 40.767 88.49

ములుగు 13.445 11.673 86.82

వికారాబాద్ 40.485 31.363 77.47

వనపర్తి 18.392 14.219 77.31

జీహెచ్‌ఎంసీ 50.000 26.446 52.89

హెచ్‌ఎండీ 750.000 345.180 46.02

మొత్తం 2002.394 1534.370 76.63