- మంత్రి కొండా సురేఖ
- పొంగులేటితో కలిసి మొక్కలు నాటిన సురేఖ
ఖమ్మం, జూలై 3 (విజయక్రాంతి): భవిష్యత్తు తరాలకు మేలు చేయాలనే ఉద్దేశం తోనే వజ్రోత్సవ వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవా దాయశాఖ మంత్రి కొండాసురేఖ అన్నారు. బుధవారం సత్తుపల్లి మండలం గొల్లగూడెం అటవీ భూముల్లో రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మెక్కలు నాటారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ ఉత్పత్తుల స్టాల్, ఫొటో ప్రదర్శనను మంత్రులు తిలకించారు. జలగంవెంగళరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్ర మంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టారాగమయి దయానంద్‌లు పాల్గొన్నారు.