calender_icon.png 12 March, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచ పట్టణ మండలంలో వనమా రాఘవేందర్ విస్తృత పర్యటన

11-03-2025 10:48:10 PM

పలు కుటుంబాలను  పరామర్శ.. 

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ మండలంలోని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు మంగళవారం విస్తృతంగా పర్యటించి తన కుటుంబాలను పరామర్శించారు. మండల పరిధిలోని మొండికట్ట గ్రామంలో వనమా కుటుంబానికి ఎంతో ఆత్మీయుడు పాల్వంచ సొసైటీ సభ్యులు చెల్లా వెంకన్న ఇటీవల అకస్మాత్తుగా మరణించడంతో ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. కోడిపుంజుల వాగు గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాదునాయక్ గృహాన్ని సందర్శించి యోగక్షేమలో అడిగి తెలుసుకున్నారు. 

పాల్వంచ పట్టణంలోని సీతారాం పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నామ మల్లయ్య కుమారుడు, బీఆర్ఎస్ యువజన నాయకుడు నామ నవీన్ తండ్రి నామ వెంకటేశ్వర్లు అనారోగ్యానికి గురికావడంతో వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. మండల పరిధిలోని దంతలబోరు గ్రామంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పోలేబోయిన కన్నయ్య, పోలేబోయిన ముత్తయ్య, పోలేబోయిన ఎల్లయ్య, పోలెబోయిన వీర్రాజు కుటుంబాన్ని సందర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దంతల బోరు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు గ్రంధి రంగారావు నాగమణి కుమారుడు గ్రంధి వినయ్ పెళ్లి సందర్భంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. 

బండ్రుగొండ గ్రామానికి చెందిన నిమ్మల ప్రసాదు ఇటీవల కరెంట్ షాక్ తో అకస్మాత్తుగా చనిపోయిన సందర్భంగా వారి గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రాకాడ సంతాపం సానుభూతి తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవ వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కనగాల బాలకృష్ణ, డిష్ నాయుడు, బీఆర్ఎస్ పాల్వంచ మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్ మూర్తి, పాల్వంచ మాజీ ఎంపీపీ మడవి సరస్వతి, పాల్వంచ పట్టణ మహిళా అధ్యక్షురాలు బట్టు మంజుల, పాల్వంచ పట్టణ అధ్యక్షులు దుర్గాప్రసాద్, బీఆర్ఎస్ పాల్వంచ జనరల్ సెక్రెటరీ నారకట్ల రాజశేఖర్, మాజీ ఎంపీటీసీ వీర్రాజు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు