25-03-2025 10:43:25 PM
పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాసగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షికోత్సవ కళ్యానోత్సవంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమ రాఘవేందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన పూజలో పాల్గొన్న అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కనగాలా బాలకృష్ణ సమ్మయ్య గౌడ్ కుంపటి శివ దాసరి నాగేశ్వరరావు కంచెర్ల రామారావు, హబీబ్, కాల్వ ప్రకాష్, ఏనుగుల శ్రీను నరకట్ల రాజశేఖర్, భూక్యా వీరన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.