calender_icon.png 28 April, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనజీవి రామయ్యకు భారతరత్న ఇవ్వాలి

13-04-2025 12:00:00 AM

-ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్.భద్ర

ముషీరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి) : వనజీవి రామయ్యకు భారతరత్న ఇవ్వాలని ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ భద్ర డిమాండ్ చేశారు. శనివారం సంస్థ ఆధ్వర్యంలో పద్మశ్రీ వనజీవి రామయ్య సంతాప సభ ఎంఎంసీసీ టాలెంట్ హైస్కూల్ కరస్పాండెంట్ తమ్మినేని సత్యనారాయణ అధ్య క్షతన జరిగింది. సంస్థ కార్యవర్గ సభ్యులు బిఎస్సి పార్టీ తెలంగాణ సెంట్రల్ కోఆర్డినేటర్ దయానంద రావుతో కలసి భద్ర మా ట్లాడుతూ జీవితం మొత్తం నిస్వార్ధంగా ప్ర కృతి పరిరక్షణ కోసం అంకితం చేసిన ధన్యజీవి వనజీవి రామయ్య అని కొనియాడారు.

కోటి మొక్కలు పైగా నాటి జీవితం మొత్తం వివిధ వృక్షజాతులను జంతు జాతులను సంరక్షించడం కోసం తన జీవితాన్ని అంకి తం చేసిన అంతర్జాతీయ స్థాయి పర్యావరణవేత్త అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారన్నారు. భవిష్యత్ తరాలకు వారి పేరు మీద ఒక యూని వర్సిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రామ య్య జీవిత చరిత్రను పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు అన్ని భాషలలో బోధిం చాలన్నారు. వారి కాంస్య విగ్ర హం ట్యాంక్ బండమీద ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి నిఖి ల్,  కోశాధికారి రిజ్వాన్, సహాయ కార్యదర్శి రాజేష్, రామకృష్ణ, గణేష్, లక్ష్మణ్, లక్ష్మి, నజీమున్నీసా తదితరులు పాల్గొన్నారు.