13-04-2025 02:31:27 PM
హైదరాబాద్: హరిత పోరాట యోధుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య(Vanajeevi Ramaiah funeral) అంత్యక్రియలు ఆదివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఏదులాపురం పరిధి రెడ్డిపల్లి శ్మశానవాటికలో రామయ్య అంత్యక్రియలు నిర్వహించారు. వనజీవి రామయ్య పార్థివదేశాన్ని కుటుంబసభ్యులు ఖననం చేశారు. వనసంరక్షకుడికి అటవీశాఖ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఖననం చేసిన ప్రాంతంలో కుటుంబ సభ్యులు, అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటారు. అంతకుముందు రామయ్య పార్థీవ దేహానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) నివాళులర్పించారు. రామయ్య ఆశయ సాధనకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వనజీవి రామయ్య 87 సంవత్సరాల వయసులో ఖమ్మం గ్రామీణ మండలంలోని రెడ్డిపల్లెలోని తన నివాసంలో నిద్రలోనే మరణించారు. రామయ్య కోటి మొక్కలను నాటారు. ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2017లో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ(Padma Shri Vanajeevi Ramaiah)తో సత్కరించింది. రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, జిల్లా మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేయగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గ్రామాన్ని సందర్శించి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.