పాపన్నపేట, సెప్టెంబర్ 6: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ‘మంజీరా’ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వద్ద వరద ఉధృతి పెరిగింది. వరద వన దుర్గా భవానీ ఆలయాన్ని చుట్టుముట్టింది. ఆరు రోజులుగా ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నది. దీంతో అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులు రాజగోపురం వరకు వచ్చి, పూజలు చేసుకుని తిరిగి వెళ్తున్నారు.