- సిద్దిపేట జిల్లాలో 15 లక్షల మొక్కలు నాటాలి
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకాధికారి షఫియుల్లా ఖాన్
సిద్దిపేట, జూన్ 29 (విజయక్రాంతి)/గజ్వేల్: వన మహోత్సవం కార్యక్రమం ద్వారా సిద్దిపేట జిల్లాలో 15 లక్షల మొక్కలు నాటాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి షఫియుల్లా ఖాన్ ఆదేశించారు. శనివారం గజ్వేల్ మండలంలోని దాచారం, దిలాల్‌పూర్ గ్రామాల్లో పర్యటించిన ఆయన.. పల్లె ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్, చేర్యాల మండలంలోని వీరన్నపేట, కొత్త దొమ్మాట, సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్నగుండవేళ్లి, తోర్నాల గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో వన మహోత్సవం నిర్వహించే ప్రదేశాలను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మను చౌదరితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ.. జిల్లాలో వన మహోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఒక్కో అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కొరారు. జూలై మొద టి వారంలో వన మహోత్సవం ప్రారంబించాలని సూచించారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ గరీమ అగర్వాల్, డీపీవో దేవకిదేవి, జెడ్పీ సీఈవో రమేశ్, అదనపు డీఆర్ డీవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.