calender_icon.png 15 January, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన మహోత్సవం లక్ష్యాలను సాధించాలి

06-07-2024 02:20:40 AM

నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు 

నిజామాబాద్, జూలై 5 (విజయక్రాంతి) : వన మహోత్సవం కార్యక్రమం కింది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికబద్దంగా ముందుకెళ్లాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను కోరారు. శుక్రవారం వనమహాత్సవంపై అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయా శాఖల వారీగా నాటాల్సిన మొక్కలకు సం బంధించిన లక్ష్యాలను గుర్తుచేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున విరివిగా మొక్కలు నాటాలని, దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, నిర్ణీత గడువులోపు లక్ష్యం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తిస్తూ, జియో ట్యాగింగ్ పూర్తి చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపుల ఖాళీ ప్రదేశాలతో పాటు, చెరువులు, కాలువలు, కట్టలపై పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు పకడ్భందీగా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులను చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమీషనర్ మకరంద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.