మంచిర్యాల: బెల్లంపల్లి మండలంలోని బుగ్గ దేవస్థానం వద్ద సోమవారం చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు ఆధ్వర్యంలో వనమహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాండూర్ ఎంపీడీఓ దంపతులు పూల మొక్కలను నాటారు.
దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పూల మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరంగి శంకర్ ,దేవస్థాన అర్చకులు శ్రీరాంపట్ల వేణుగోపాల శాస్త్రి, ఈవో బాపి రెడ్డి, క్లార్కు భాను, ధర్మకర్తల మండలి సభ్యులు మురుకూరి బాలకృష్ణ, భామండ్లపల్లి గోపి లు పాల్గొన్నారు.