calender_icon.png 28 September, 2024 | 10:47 AM

వన మహోత్సవ లక్ష్యం పూర్తిచేయాలి

27-09-2024 02:36:33 AM

  1. జిల్లా అభివృద్ధి సమీక్షలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ
  2. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

మెదక్, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 18 లక్ష ల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌వో జోజిని ఆదేశించారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని తరుగు పేరుతో రైస్‌మిల్లర్లు మోసం చేస్తున్నారని, అలాగే రైతులను మోసం చేసి కొంతమంది సొసైటీల్లో కోట్లాది రూపాయ లు దోచుకున్నారని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

వానాకాలం పంటల కొనుగోలు విషయంలో అధికారులు ఇప్పటి నుంచే తగిన చర్యలు చేపట్టాల ని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మెదక్, నర్సాపూర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్‌రావు, సునీతారెడ్డి, సంజీవరెడ్డి, ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.