calender_icon.png 30 October, 2024 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష గాజులతో వన దుర్గామాత అలంకరణ

15-07-2024 02:07:56 AM

పాపన్నపేట, జూలై 14 : మంజీరా నది ఒడ్డున వెలసిన వనదుర్గా మాతను ఆషాఢ మాసం రెండో ఆదివారాన్ని పురస్కరించుకొని లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చ కులు అమ్మవారికి తెల్లవారుజామున నాలు గు గంటలకే ప్రత్యేకాలంకణతో విశేష పూజలతో పాటు అభిషేకం నిర్వహించారు. దుర్గా దేవికి అలంకారమంటే ప్రీతికరమని, కాబట్టి అమ్మవారిని గాజులు, పూలు, పసుపు, పూల మాలలు, వస్త్రాలతో అలంకరించినట్లు అర్చకులు తెలిపారు. సెలవు దినం కావడంతో భక్తులు  దుర్గమ్మ దర్శనానికి పోటెత్తడంతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి.