calender_icon.png 5 March, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామనరావు దంపతుల హత్యకేసు.. రెండు వారాలకు వాయిదా

05-03-2025 01:14:05 AM

న్యూఢిల్లీ, మార్చి 4: న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్యపై సీబీఐ దర్యాప్తు చేయా లని దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టిం ది. పిటిషనర్ తరఫున న్యాయవాది మేనకగురుస్వామి వాదనలు వినిపించారు. కేసు విచారణను సీబీఐకి ఇవ్వ కుండా అడ్డుకోవడానికే వాయిదాలు కోరుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారని.. ఇప్పుడు మళ్లీ అదే అంటున్నారని వాదించారు. అయితే కేసుకు సంబంధించి సమాచారహక్కు చట్టం ద్వారా సమాచారం కోరామని పుట్ట మధు తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.

సమాచారం రావడానికి సమయం పడుతుందని.. అందుకే రెండు వారా లు వాయిదా వేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలను విన్న సుప్రీం ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.