calender_icon.png 8 January, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వార్థం కోసం విలువలు తాకట్టు

17-07-2024 12:05:00 AM

రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విలువలకు తిలోదకాలు ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు నమ్మకం లేకుండా పోతున్నది. తాజాగా పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీనుంచి ఈ పార్టీలోకి చేరిన శాసనసభ్యుల సంఖ్య పదికి చేరినట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి పోకడలవల్ల ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏముంటుందో వారికే తెలియాలి. ఒక పార్టీనుంచి మరో పార్టీలోకి ‘జంప్’ చేసే సంస్కృతిని పెంచి పోషించడం కేవలం వాళ్ల సొంత పనులకోసమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వాన్ని కూలదోస్తారన్న భయంతోనే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నట్టు కొందరు కాంగ్రెస్ పెద్దలు చెప్పడం తమను తాము తగ్గించుకున్నట్టుగానే భావించవలసి ఉంటుంది. 

-సాయితేజ, నాచారం, హైదరాబాద్