calender_icon.png 16 April, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా విలువలను పెంపొందించాలి

15-04-2025 12:00:00 AM

ఓపెన్ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): నైపుణ్యతలేని కార్మికులకు నైపుణ్య త అందించాలనే ప్రాథమిక లక్ష్యంతో సార్వత్రిక విద్యా వ్యవస్థ, విశ్వవిద్యాలయానికి ఆ నాడు మంత్రి హోదాలో రూపకల్పన చేశామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవ రావు తెలిపారు. వర్సీటీలు విద్యావిలువలను పెంపొందిస్తూ అందరికీ ఉన్నత విద్యను ఉన్నత ప్రామాణాలతో అందించాలని సూచించారు.

బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో మహనీయుల జన్మదినోత్సవాలను పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన సామాజిక సాధికారత వారోత్సవాల ముగిం పు కార్యక్రమానికి కేశవరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 43 ఏళ్ల క్రితం సార్వత్రిక విద్యను అంకురార్పణ చేసే క్రమంలో భాగస్వామ్యమైన తాను, ఈరోజు వర్సిటీ ఎదిగిన క్రమం చూసి చాలా గర్విస్తున్నానన్నారు. సాంకేతిక విద్యా కోర్సులతో ముందుకు వెళ్లాలని, నైపుణ్య కోర్సులు విద్యార్థులకు ఉపాధి కల్పించడమే కాకుండా వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని  ఆయన ఆకాంక్షించారు.