05-04-2025 01:32:40 AM
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 4 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర బార్ అసోసియేషన్ కు శుక్రవారం నాడు హోరా హోరీగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా సీనియర్ అడ్వకేట్ వల్లందాస్ వెంకటయ్య, ఉపాధ్యక్షులుగా ఎర్ర రేణుక, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ బొల్లెపల్లి కుమార్, జాయింట్ సెక్రటరీగా చేగూరి ఐలయ్య,
లైబ్రరీ సెక్రటరీగా సామల రాజేందర్ రెడ్డి, కల్చరల్ సెక్రటరీగా పల్లెర్ల నరహరి, కోశాధికారిగా ముద్దసాని చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కందుల రాకేష్ కుమార్ లు ఎన్నికైనట్లు చీఫ్ ఎలక్షన్ అధికారి జిట్టా భాస్కర్ రెడ్డి ప్రకటించారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారులుగా సిద్ధిరాములు, జై శివకృష్ణ లు వ్యవహరించారు.