22-04-2025 03:44:06 PM
అమరావతి,(విజయక్రాంతి): సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆయన రిమాండ్‌ను మరోసారి పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వు జారీ చేసింది. వల్లభనేని వంశీ మునుపటి రిమాండ్ కాలం నేటితో ముగియనున్నందున ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది ఆయన కస్టడీని పొడిగించాలని పోలీసుల తరపున కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనలను కోర్టు అంగీకరించి రిమాండ్‌ను మే 6 వరకు కొనసాగించాలని తీర్పునిచ్చింది. వల్లభనేని వంశీతో పాటు, మరో నలుగురు నిందితుల రిమాండ్‌ను కోర్టు మే 6 వరకు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.