హైదరాబాద్, డిసెంబర్ 27: బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో లాస్ట్ మైల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్న వక్రంగీ విస్తరణ కార్య కలాపాలకు రూ. 980 కోట్ల వరకూ నిధుల్ని సమీకరించాలన్న ప్రతిపాదనను కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. అవసరమైన అనుమతులకు లోబడి కన్వర్ట్‌బుల్ వారెంట్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన అర్హమైన సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రైవేట్ ప్లేస్‌మెంట్ చేయడం ద్వారా నిధుల్ని సమీకరించనున్నట్లు వక్రంగీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవల కెనరా బ్యాంక్‌తో వక్రంగీ కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్ (సీబీసీ) ఒప్పందా న్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా తమ నెట్‌వర్క్‌తో తూర్పుజోన్‌లోని బ్యాంక్‌ల విస్తరణకాని ప్రాంతాలకు సమగ్ర బ్యాంకింగ్ సర్వీసుల్ని అందించగలుగుతామని వక్రంగీ తెలిపింది.