తెలంగాణాలో సాగుకు ప్రోత్సాహం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఏలూరులో వక్క సాగు పరిశీలన
ఖమ్మం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): వక్క పంట సాగు రైతన్నల ఇంట సిరులు కు రిపిస్తుందని, తెలంగాణాలో సైతం వక్క పం ట సాగును ప్రోత్సహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఏపీలోని ఏలూరు జిల్లా కామవరపు కోటలో వక్క సాగును పరిశీలించారు.
రైతులతో సాగు పద్ధతులు, ఆదాయ వ్యయాలపై చర్చించారు. తెలంగాణలో వక్కసాగు విస్తరణ అంశాలు, అవకాశాలపై నిపు ణులతో చర్చించారు. మంత్రి మాట్లాడు తూ.. వక్క సాగుతో రైతులు రూ.లక్షల్లో సం పాదిస్తున్నారని అన్నారు. కొబ్బరి, పామాయిల్ తోటలలో అంతర పంటలుగా సాగు చేస్తూ అధిక లాభాలు అర్జిస్తున్నారని వివరించారు.
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వక్క సాగు అనుకూల నేలలు, వాతావరణ పరిస్థితులు, నీటి వినియోగం తదితర అంశాలపై నిపుణులతో చర్చించి, సాగును ప్రొత్సహించనున్నట్టు తెలిపారు.