27-02-2025 12:00:00 AM
కూసుమంచి, ఫిబ్రవరి 26 : మహాశివరాత్రి సందర్భంగా కూసుమంచి శివాలయంకు వచ్చే భక్తుల కోసం మండల కేంద్రంలోని వజ్ర హాస్పటల్ యాజమాన్యం ఇంటూరి నాగరాజు చౌదరి ఆధ్వర్యంలో 20 ఆటోలను ఏర్పాటు చేశారు.. మండల కేంద్రము నుండి శివాలయంకి వెళ్ళడానికి దాదాపు కిలోమీటరు పైగా దూరం ఉండడంతో వృద్దులకు ,వికలాంగులకు ,చిన్న పిల్లలకు ,మహిళలకు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని కోసం సొంత ఖర్చులతో భక్తుల కోసం 20 ఆటోలను ఏర్పాటు చేశారు.. ఇంటూరి నాగరాజు మండల కేంద్రంలో హాస్పటల్ ఏర్పాటు చేసి అనేక మంది పేదలకు అందుబాటులో వైద్యం అందించారు.. శివరాత్రి పండుగ రోజు భక్తుల కోసం నాగరాజు చౌదరి ఆధ్వర్యంలో ఆటోలను ఏర్పాటు చేయడంతో భక్తులు, పలువురు అభినందనలు తెలిపారు.