calender_icon.png 26 December, 2024 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజాతశత్రువు వాజ్‌పేయి

26-12-2024 01:46:38 AM

  • కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శతజయంతి వేడుకలు
  • చిత్రపటాలకు నివాళులు

కరీంనగర్ సిటీ, డిసెంబర్ 25 (విజయక్రాంతి) : కరీంనగర్‌లోని టవర్ సర్కిల్ వద్ద బిజెపి సీనియర్ నాయకులు జే.డి.భగవాన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, బిజెపి అగ్రనాయకులు, భారత రత్న  అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకులు పి.సుగుణాకర్ రావు  ముఖ్యఅతిథిగా పాల్గొ ని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది.

ఈ సందర్భంగ మాట్లాడుతూ అటల్ బిహారి వాజ్‌పేయి గొప్ప రాజ నీతిజ్ఞుడు, అజాతశత్రువు, అందరి ఆదర అభిమానాలు చూరగొన్న మహానీయుడనీ కొనియాడారు. రాజకీయాలు అంటే ఒకరినొకరు దూషించుకోవడం, ఉన్నాయి లేనట్టుగా లేనియి ఉన్నట్టుగా కల్లబొల్లి కబుర్లు చెప్పుకోవడం ప్రస్తుత రాజకీయాల లో చూస్తున్నా మని కానీ  అటల్ బిహారీ వాజ్‌పేయి దేశ హితం కొరకు పాటుపడిన వ్యక్తి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, గంప జగన్, మిరియాల్కర్ ఆనంద్, బేతి మహేందర్ రెడ్డి, తాడూరి బ్రహ్మం, నగునూరి లక్ష్మణ్, గుడిపాటి జితేందర్ రెడ్డి, కూరగాయల తిరుపతి, కామారపు నరహరి, పబ్బ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో...

భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి పురస్కరించుకొని భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో బుధవారం తహసిల్ చౌరస్తా వద్ద వాజ్‌పేయి చిత్రపటా నికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారత సురక్షా సమితి రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఏసీఎస్ రాజు, నాయకులు కాశీనాథం, పుప్పాల సత్యనారాయణ, నరేందుల శ్రీనివాస్, గంగాధర్  పాల్గొన్నారు.

వేములవాడ బిజెపి కార్యాలయంలో..

సిరిసిల్ల, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): భారత మాజీ ప్రధాని, భారతరత్న, భారతీయ జనతా పార్టీ మహా నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఘనంగా నిర్వహించారు. బుధవారం వేము లవాడ బిజెపి కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీ యాలకు నిలువెత్తు నిదర్శనమని అణు పరీక్షల ద్వారా భారత అను శక్తిని ప్రపం చానికి చాటిన ధీశాలి అన్నారు.

ప్రతిపక్షలతో సైతం శభాష్ అనిపించుకున్న మహానేతని, అనేకమైన విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన మహా నాయకుడు అన్నారు. పార్లమెంటు సాక్షిగా వారి అనేక ప్రసంగాల ద్వారా జీవించడం అయిన దేశం కోసమే మరణించడం అయిన దేశం కోసమే అని చాటుకున్న భరతమాత ముద్దు బిడ్డ అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను  మననం చేసుకుంటూ నరేంద్ర మోడీ  పాలనలో భారత్ వికసిత్ భారత్ లక్ష్యంగా కొనసాగుతుందంటే కారణం  వాజ్‌పేయి చూపిన మార్గమే అన్నారు.

వారు చూపిన మార్గంలోనే  నరేంద్ర మోడీ పాలన కొనసాగడం దాంట్లో భాగంగానే సుపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, బిజెపి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, రూరల్ మాజీ ఎంపీపీ బండ మల్లేశం, పిన్నింటి హనుమన్లు, అక్క పెళ్లి వివేక్ రెడ్డి, గుడిసె మనోజ్, రేగుల రాజకుమార్, నామాల శేఖర్ బిల్ల కృష్ణ, నేరెళ్ల సాయికుమార్, మమిండ్ల లక్ష్మీరాజం, రేగుల శ్రీకాంత్ జవాజి రాజశేఖర్, సగ్గు రాహుల్, అన్నం నరసయ్య నగేష్, రమేష్ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నవభారతానికి పునాదులు వేసిన వాజ్‌పేయి : బిజెపి రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు శ్రావణి

జగిత్యాల అర్బన్, డిసెంబర్ 25 (విజయ క్రాంతి) : విలక్షణమైన రాజ నీతిజ్ఞతతో నవ భారతానికి పునాదులు వేసిన వ్యక్తి అటల్ బిహారి వాజ్‌పేయి అని బిజెపి రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల సంద ర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిం చారు. ప్రభుత్వ ఆసుపత్రి, వాల్మీకి ఆవాసం, భగిని నివేదిత ఆవాసంలో పండ్ల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా భోగ శ్రావణి మాట్లాడుతూ.. నవ భారతానికి పునాదులు వేసిన మహోన్నత శిఖరం అటల్ జి అని కొనియాడారు. జాతీయ రహదారుల నిర్మా ణంతో దేశ అనుసంధానానికి మార్గం చూపి ప్రగతికి బాటలు వేసిన మేధావి అని అన్నారు. అగ్ర రాజ్యపు బెదిరింపులను బేఖా తరు చేస్తూ దేశ భద్రతకు అణు కవచం తొడిగిన నాయకుడు వాజ్‌పేయి అని అన్నా రు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాగిళ్ల సత్యనారాయణ, మ్యాన మహేష్, జ్ఞానేశ్వర్, భూమి రమణ, సిరికొండ రాజన్న, గాదాసు రాజేందర్, సాంబారి కళావతి, దురిశెట్టి మమత పాల్గొన్నారు.

కోరుట్ల పట్టణంలో వాజ్‌పేయి శతజయంతి

కోరుట్ల, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా కోరుట్ల పట్టణంలోని 22వ వార్డు బాలాజీ రోడ్ రాంనగర్‌లో భారతీ య జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో వాజ్‌పేయి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

అలాగే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. కార్య క్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, ఓబీసీ మోర్చా రాష్ర్ట ఉపా ధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాడవేణి నరేష్, కౌన్సిలర్ పెండె గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుదవేని మహేష్, సత్యం, ధనుంజయ్, రాచమడుగు శ్రీనివాసరావు, జగదీశ్వర్ పాల్గొన్నారు.