calender_icon.png 24 December, 2024 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడూ రేపు వాజ్‌పేయి శత జయంతి వేడుకలు

24-12-2024 01:33:07 AM

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా రెండు రోజుల పాటు బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.

హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 తేదీ వాజ్‌పేయి జయంతి అని, ఈ సందర్భంగా మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయి ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారన్నారు. బుధవారం వాజ్‌పేయి జయంతి సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో పోలింగ్ బూత్‌ల పరిధిలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పిస్తామన్నారు. అన్ని జిల్లాకేంద్రాల్లో వాజ్‌పేయి కవితా సంపుటిని ఆవిష్కరిస్తామన్నారు. ప్రతి మండల, జిల్లాకేంద్రంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తామన్నారు.