calender_icon.png 28 January, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండర్-17 తెలంగాణ జట్టు కెప్టెన్ వైష్ణవి రత్న...

27-01-2025 02:40:22 PM

మణుగూరు,(విజయక్రాంతి): జాతీయ స్థాయి అండర్- 17 బాలికల క్రికెట్ పోటీ(National Level Under-17 Girls Cricket Competition)ల్లో పాల్గొనే తెలంగాణ జట్టుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన పోలబోయిన వైష్ణవి రత్న ఎంపికైంది. ఈ మేరకు ఖమ్మం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ నరసింహమూర్తి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైష్ణవి రత్న పినపాక జూనియర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. హైదరాబాద్ లోని నెక్స్జెన్ క్రికెట్ అకాడమీ(Nexgen Cricket Academy)లో శిక్షణ పొందుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా కెప్టెన్ గా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో ఖమ్మం జట్టును ప్రథమ స్థానంలో నిలపడం లో కెప్టెన్ గా ఆమె ప్రాతినిధ్యం, క్రీడా స్ఫూర్తి, ప్రతిభలను గుర్తించి తెలంగాణ జట్టుకు కెప్టెన్ గా నియమించినట్లు తెలిపారు.