calender_icon.png 9 January, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదరగొట్టిన వైశాలీ

02-01-2025 12:00:00 AM

  1. కాంస్యం నెగ్గిన భారత గ్రాండ్‌మాస్టర్
  2. వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్

న్యూయార్క్: భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ ఆర్.వైశాలీ వరల్డ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్‌లో కాంస్యంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల సెమీఫైనల్లో వైశాలీ 0.5-2.5 తేడాతో చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ చేతి లో ఓటమి చవిచూసింది. అంతకముందు క్వార్టర్స్‌లో మాత్రం వైశాలీ 2.5-1.5 తేడాతో చైనా కు చెందిన జు జినెర్‌ను ఓడించి కాంస్యం ఖరారు చేసుకుంది.

వైశాలీ కాంస్యం సాధించడంపై చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సంతోషం వ్యక్తం చేశా డు. ‘పతకం గెలిచిన వైశాలీకి అభినందన లు. మా వాకా చెస్ మే ట్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది’ అని తెలిపా డు.

కాగా ర్యాపిడ్ విభాగంలో తెలుగు తేజం కోనేరు హంపి స్వర్ణంతో మెరిసిన సంగతి తెలిసిందే. ఓపెన్ సెక్షన్ విభాగంలో ప్రపంచ నంబ ర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నెపోమినాట్చి సంయుక్త విజే తలుగా నిలిచారు. ఫైనల్ ఫలితం తేలకపోవడంతో ఇద్దరిని విజేతలుగా ప్రకటించారు.