calender_icon.png 20 April, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైరా బోడేపూడి వైద్య శిబిరం విజయవంతం

20-04-2025 04:29:48 PM

118 నెలలుగా వైద్య శిబిరం నిర్వహిస్తున్న సిపిఎం..

వేసవి కాలంలో బీపీ, షుగర్ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి..

వైద్య బృందం చీకటి భారవి, పిల్లలమర్రి సుబ్బారావు..

వైరా (విజయక్రాంతి): సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆద్వర్యంలో ప్రతి నెల మూడవ ఆదివారం స్థానిక సిపిఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వేంకటేశ్వరరావు భవనం నందు నిర్వహించే బోడేపూడి కళా నిలయం వైద్య శిబిరాన్ని ఆదివారం 118వ నెల విజయవంతంగా నిర్వహించారు. వైరా పట్టణ సిపిఎం పార్టీ బోడేపూడి వైద్య శిబిరం ద్వారా గత 118 నెలలుగా షుగర్, బిపి, కొలెస్ట్రాల్, గ్యాస్, అల్సర్ తదితర వ్యాధులకు నెల రోజులకు సరిపడా మందులను 100 రూపాయలకు అందిస్తున్నారు. ఆదివారం బోడేపూడి వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ చీకటి భారవి,  డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు బృందం ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.

118 నెలలుగా బోడేపూడి వైద్య శిబిరం డాక్టర్ల బృందం ప్రతి నెలా క్రమం తప్పకుండా హాజరు కావడం, ఉదయం 6 గంటల నుండే వాలంటీర్లు నిబద్దతతో పని చేయటం వలన బోడేపూడి వైద్య శిబిరం విజయవంతంగా ముందుకు సాగుతూ వేలాది మంది పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ చీకటి భారవి, డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు మాట్లాడుతూ... ప్రతి రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించ వచ్చునని అన్నారు. షుగర్, బిపి మందులు దీర్ఘకాలంగా వాడే వారు గుండె, కిడ్నీ, న్యూరో సంబంధించిన పరీక్షలు తరచూ చేయించుకోవాలని సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్నదని  బీపి, సుగర్, గుండె, ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్నవారు జాగర్తగా ఉండాలని తెలిపారు.

వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయట ఎక్కువగా తిరగవద్దని, రోజువారీగా తగినన్ని చల్లని మంచినీరు ఎక్కువగా తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  బోడేపూడి వైద్య శిబిరం బాధ్యులు బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, సుంకర సుధాకర్, చింతనిప్పు చలపతిరావు, బొంతు సమత, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహనరావు, అనుమోలు రామారావు, మాదినేని రజిని, మల్లెంపాటి ప్రసాదరావు, హరి వేంకటేశ్వరరావు, యనమద్ది రామకృష్ణ, కంభంపాటి సత్యనారాయణ, పాసంగులపాటి చలపతిరావు, ఐలూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.