18-03-2025 07:43:30 PM
వైరా (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉన్న పేరుని మార్చాలని తీసుకునే నిర్ణయాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పేరు మార్చే నిర్ణయం తీసుకోవడం పట్ల ఖమ్మం జిల్లా ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం పొట్టి శ్రీరాములు రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పసుమర్తి చందర్రావుతో పాటు వైరా నుండి ఆర్యవైశ్యుల సంఘం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
మాజీ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు వనమా విశ్వేశ్వరరావు ఆర్యవైశ్య మహాసభ జిల్లా సెక్రెటరీ వనమా కిరణ్ కుమార్ ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాసరావు, వైరా కోదండ రామాలయం మాజీ చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు, వజినేపల్లి చక్రవర్తి, నూకల ప్రసాద్ రావు, వైరా మండల పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్ ధారా వెంకటకృష్ణ సముద్రాల మురళీకృష్ణ జల్లా అవినాష్ లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.