calender_icon.png 10 January, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో భారీగా అమ్ముడుపోయిన వైకుంఠ ఏకాదశి టిక్కెట్లు

09-01-2025 09:56:44 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో జనవరి 10వ తేదీ ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు మిథిలా స్టేడియం వద్ద  జరిగే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు భారీగా ఆన్లైన్లో అమ్ముడుపోయాయి. మొత్తం ఆరు సెక్టార్లకు 1496 టికెట్లు ఆన్లైన్ లో పెట్టగా గురువారం సాయంత్రానికి1199 టికెట్లు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా రెండు వేల రూపాయలు విలువ గల విఐపి సెక్టార్ టిక్కెట్లు ఆన్లైన్లో పెట్టిన 421 టికెట్లు అలాగే 1000 రూపాయలు పెట్టిన ఏ సెక్టార్ టిక్కెట్లు 215, 500 రూపాయలు విలువ చేసే సి సెక్టార్ టికెట్లు 100 పెట్టినవన్నీ ఆన్లైన్లో అమ్ముడుపోయినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇంకా 500 రూపాయలు విలువ గల బి సెక్టార్ టిక్కెట్లు 76, 500 రూపాయలు విలువగల డి సెక్టర్ టిక్కెట్లు 26, 250 రూపాయలు విలువ గల ఇ సెక్టార్ టికెట్లు195 ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల భక్తులు టీవీ పాత్రులు కావాలని ఆలయ అధికారి రామకృష్ణ కోరారు.