నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రాచీన దేవాలయమైన దేవరకోట ఆలయంలో ఈనెల 10న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి నిర్వహించడం జరుగుతుందని చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను జిల్లా అధికారులతో పాటు డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావు, మున్సిపల్ చైర్మన్ గండ్రదీశ్వర్ తదితరులకు అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, పాలకవర్గ సభ్యులు ఉన్నారు.