calender_icon.png 11 January, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

10-01-2025 11:18:36 PM

పలు ఆలయాలు భక్తులతో కిటకిట

తిరుపతిలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న నిజామాబాద్, కామారెడ్డి, జుక్కల్, ఎమ్మెల్యేలు

హైదారాబాద్ ఎర్రగడ్డలోని వెంకటేశ్వరాస్వామి ఆలయంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతుల పూజలు

కామారెడ్డి (విజయక్రాంతి): దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్న సందర్భంగా మహవిష్ణువు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని కామారెడ్డి, జుక్కల్, నిజామాబాద్ ఎమ్మెల్యేలలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, తోట లక్ష్మీనారాయణ, ధన్పల్ సూర్యనారాయణ గుప్తలు కుటుంబ సమేతంగా తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని ఉత్తరద్వారా గుండా వెళ్లి దర్శించుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తర ద్వారంలో వెళ్లి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజామునకు ముందే ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారా గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.

ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తులు తండోపతండాలు తరలివచ్చి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. పంచముఖి హనుమాన్ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారాం గుండా దర్శించుకున్నారు. లింగాపూర్, చిన్నమల్లారెడ్డి, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తు పాల్గొని ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు హైదారాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆయా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారా ప్రవేశం భక్తులు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా  తెల్లవారుజాము నుంచి ఆలయాల్లోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.