calender_icon.png 11 January, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ జిల్లాలో ఘనంగా వైకుంఠ ఏకాదశి

11-01-2025 12:00:00 AM

కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు

మెదక్ జిల్లా నెట్వర్క్, జనవరి 10 (విజయక్రాంతి): వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మెదక్ జిల్లాలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఉదయం నుండే భక్తులు బారులుదీరి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం పల్లకి సేవ, తీర్థ వితరణ చేపట్టారు.

ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేం దర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ టి.చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మ కన్నా గ్రామంలో వెలిసిన శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు ముందుగా ఆలయ పూజారులు రాఘవేంద్ర, శ్రీనివాస్, సాయి, స్వామి వారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.

ఆలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసినీరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ సి డి సి చైర్మన్ చిలుముల దుర్గారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ , బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కాజీపేట రాకేష్, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పట్లోరి శ్రీనివాసరావు, పిఎసిఎస్ సొసైటీ డైరెక్టర్  గాదే రాయగిరి, మాజీ సర్పంచులు చిలుముల వెంకటేశ్వర రెడ్డి శివాంజనేయులు పాల్గొన్నారు.

అలాగే చేగుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శనం చేసుకున్నారు. వెల్దుర్తి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పంచా మృతాలతో అభిషేకాలు నిర్వహిం చారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారి గిరీశ్వర్శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జగ్గా అశోక్ గౌడ్, కొమిరి శెట్టి సురేష్,  కైలాస్ సంతోష్ కుమార్, కమిరిశెట్టి రమేష్చంద్రగుప్త, భైరవదాసు నంబూద్రి  గుప్తా తదితరులు పాల్గొన్నారు.