calender_icon.png 23 October, 2024 | 4:54 AM

సెకండరీ హెల్త్ డైరెక్టరేట్‌గా వైద్య విధాన పరిషత్?

23-10-2024 02:32:50 AM

అధికారులను ఆదేశించిన  మంత్రి రాజనర్సింహ

టీవీవీపీ మార్పు కోసం సమీక్ష 

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) హాస్పిటళ్ల పనితీరు, టీవీవీపీని సె కండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్‌గా మార్చడానికి అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామో దర్ రాజనర్సింహ ఆదేశించారు.

ఈ మేరకు టీవీవీపీని సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్‌గా మార్చడం కోసం అస్కీ రూపొందించిన ప్రతిపాదనలపై మంగళవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో మంత్రి సమీక్ష నిర్వహించారు. టీవీవీపీ పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా హాస్పిటళ్లలోనే ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయా హాస్పిటళ్లలో అన్నిరకాల వసతులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ప్రస్తుత అవసరాలను మాత్ర మే గాకుండా, భవిష్యత్ అవసరాలు, ఓపీ, ఐపీ, బెడ్ స్ట్రెంత్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని సూచించారు. అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సి ద్ధంగా ఉందన్నారు. ఏపీలో వీవీపీని సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చిన క్రమంలో అక్కడ తలెత్తిన అంశాలు రిపీట్ అవకుండా జాగ్రత్త పడాలని మంత్రి సూచించారు.

చాలాచోట్ల డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ కింద కు వెళ్లిపోయాయని, కొన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు వీవీపీ పరిధిలోకి వచ్చాయని అ ధికారులు మంత్రికి తెలిపారు. వాటిలో అవసరమైన స్టాఫ్‌తోపాటు, ఏయే ఎక్విప్‌మెంట్ అవసరమో ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్ వంటి బేసిక్ వైద్య సేవలు అన్నీ వీవీపీ హాస్పిటళ్లలో అందుబాటులో ఉండాలన్నారు.

85 శాతం మంది రో గులకు జిల్లాల్లోనే వైద్యం అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం అని, ఈ లక్ష్యం నెరవేరాలంటే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యు నిటీ హెల్త్ సెంటర్లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు. కాగా హన్మకొండలోని కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం, సీకేఎం, టీబీ, కం టి దవాఖానలపై మంత్రి రాజనర్సింహ రి వ్యూ చేశారు.

ఎంజీఎం హాస్పిటల్‌లో రోగు ల ఇక్కట్లపై ఆరా తీసిన మంత్రి, అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, రెండ్రోజుల్లో పూర్తి వివరాలతో ప్రతిపాదనలు అందించాలని మంత్రి ఆదేశించారు.

త్వరలో స్వయంగా తానే ఎంజీఎం కు వస్తానని, అన్ని వార్డులు పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్,  టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, డీఎంఈ(అకాడమిక్) శివరామ్ ప్రసాద్, అస్కీ కన్సల్టంట్స్, కేఎంసీ ప్రిన్సిపల్, ఐదు హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.