calender_icon.png 31 October, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోహిత్ సాయి డాక్టర్ భాస్కర్ కు వైద్య బ్రహ్మ బిరుదు

11-08-2024 02:36:59 PM

సిద్దిపేట అర్బన్: సిద్దిపేట లోహిత్ సాయి ఆసుపత్రి నిర్వాహకుడు లాప్రోస్కోపిక్, జనరల్ సర్జన్ డాక్టర్ అమిరిశెట్టి భాస్కర్ కు వైద్య బ్రహ్మ బిరుదు అందుకున్నాడు. లలిత కళా సమాఖ్య సేవా సామాజిక సంస్కృత సంస్థ హైదరాబాదు వారి ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ లో గల హరిహర కళాభవన్ లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్ చేసిన సామాజిక కార్యక్రమాలు ఉచిత వైద్య శిబిరాలకు గాను వైద్య బ్రహ్మ బిరుదు అందజేశారు. సుమారు 100కి పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. స్వర్ణ కంకణము మెడల్ తో పాటు ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు లయన్ విజయకుమార్, సెక్రటరీ మహేంద్రవాద వెంకటేశ్వరరావు  వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.