calender_icon.png 19 April, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మెయిన్స్ లో చరిత్ర సృష్టించిన వాగ్దేవి

19-04-2025 07:08:04 PM

సాధారణ విద్యార్థులకు అసాధారణ విజయం అందించిన వాగ్దేవి కళాశాల...

విద్యార్థుల ఫలితాలు చూసి ఆనందం వ్యక్తం చేసిన కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకటరెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలలో వాగ్దేవి కళాశాల చరిత్ర సృష్టించింది. కళాశాల ఏర్పాటుచేసిన అనతి కాలంలోనే అసాధారణ ఫలితాలను సొంతం చేసుకుంటూ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉన్న కళాశాలలకు మేమేం తక్కువ అంటూ సవాల్ విసురుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు విడుదల చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలలో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి ఐఐటి అకాడమీ  విద్యను అభ్యసించిన సాధారణ విద్యార్థులకు అసాధారణ విజయాలను వాగ్దేవి ఐఐటి అకాడమీ అందించింది.  ఈ ఫలితాలలో  రోహిత్ 99.80 శాతం, మనోహర్ 99.46 శాతం, రేవంత్ రెడ్డి 98 శాతం తో విజయతీయులకు చేరారు. ఈ విద్యార్థులతో పాటు ఓంకార్, ఆర్తి, కౌశిక్, అశ్విని, మమత, నవనీత్ గౌడ్, నవీన్, శివ, శరణ్య, గణేష్ విద్యార్థులు అత్యుత్తమ శాతంతో అడ్వాన్స్ కు ఎంపికయ్యారు. వాగ్దేవి ఐఐటి అకాడమీ  విజేత వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా విజేత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్ తో విద్యార్థి పరిశీలన ప్రత్యేకంగా తెలుసుకుంటూ అవగతం చేస్తూ అంతిమంగా విజయాలను అందించాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సరియైన విధానంలో చదివి అద్వితీయ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదే తరహాలో మరి కష్టపడుతూ జేఈఈ అడ్వాన్స్ లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు జిల్లాకు మంచి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి నీట్ అకాడమీ ఇన్చార్జ్ పావని రెడ్డి, ప్రిన్సిపాల్ గీతాదేవి, యాజమాన్య సభ్యులు, అధ్యాపకులు రాఘవేంద్రరావు శివ కుమార్, నాగేందర్, సతీష్ రెడ్డి ఎంసెట్ ఇంచార్జ్ షాకీర్, యాకూబ్, సందీప్, సాదియా గోవిందరాజులు, నాగరాజు, మహేష్ గౌడ్, రామ్ రెడ్డి, శ్రావణి, వసంత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.