- పేదలను నమ్మించిన బీఆర్‌ఎస్ నేత
తహసీల్దార్‌ను అడ్డుకున్న కాలనీవాసులు
హనుమకొండ, అక్టోబర్ 8 (విజయక్రాంతి): వాడ్రా పేరుతో అధికారులు వచ్చా రని ఓ బీఆర్‌ఎస్ నేత నమ్మించడంతో పేద లు తహసీల్దార్‌ను అడ్డుకున్నారు. ఈ ఘటన వరంగల్ నగరంలోని ఎనుమాముల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసు కుంది.
బీఆర్‌ఎస్ నేత కేతిరి రాజశేఖర్ ఎనుమాముల పరిధిలోని 14వ డివిజన్‌లో సుమారు వంద గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాడు. అయితే ప్రభుత్వ స్థలం కావడంతో సద్దుల బతుకమ్మ వేడుకలకు కేటా యించాలని స్థానిక ఎస్‌ఆర్ నగర్ కాలనీవాసులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు విన్నవిం చారు. ఆ స్థలంలో తగు ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ ఇక్బాల్‌ను ఎమ్మెల్యే ఆదేశించా రు.
తహసీల్దార్ మంగళవారం ఆ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ విషయం తె లుసుకున్న రాజశేఖర్ వరంగల్‌కు ‘వాడ్రా’ టీం వచ్చిందని, పేదల గుడిసెలు, ఇండ్లు కూ ల్చుతారని భయాందోళనకు గురిచేశాడు. ని జమేనని నమ్మిన కాలనీవాసులు తహసీల్దా ర్ వాహనాన్ని అడ్డుకుని ఆందోళనకు దిగా రు.
తర్వాత అసలు విషయం తెలుసుకున్న కాలనీవాసులు తమ ఆందోళనను విరమించారు. తన విధులకు ఆటంకం కలిగించిన రాజశేఖర్‌పై తహసీల్దార్ ఎనుమాముల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు