మెదక్,(విజయక్రాంతి): జిల్లాలోని చేగుంట గ్రామం ఉన్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రజా ప్రతినిధులు సమాజానికి మేలు చేసే పనులు చేయాలని చేగుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్(Congress Party President Vadla Naveen Kumar) అన్నారు. చేగుంట మండల పరిదిలోని చందాయి పేట్ లోగల ప్రాథమిక పాఠశాలలో రూ.15 లక్షలతో ప్రహరీ గోడ చేపడుతున్న పనులకు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ... రానున్న స్థానిక ఎన్నికల్లో జనంకు సేవ చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ముజామిల్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బ నగేష్ గుప్తా, బాసరాజు, సాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.