కోలీవుడ్ స్టార్ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని ఎట్టకేలకు ప్రారంభిస్తున్నారట. ఆయన ప్రధాన పాత్రలో ‘వాడివాసల్’ అనే చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నారు. హీరో సూర్య శివ కాంబోలో ‘కంగువా’ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకోగా, ఇంకా ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. మరోవైపు డైరెక్టర్ వెట్రిమారన్.. హాస్య నటుడు సూరి హీరోగా పరిచయం చేస్తూ ‘విడుదలై’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించగా, తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. దీని సీక్వెల్‌ను కూడా వెట్రిమారన్ పూర్తి చేశారు.
ఇలా సూర్య, వెట్రిమారన్.. ఇద్దరూ తమ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘వాడివాసల్’ను తిరిగి పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ తాజా చిత్రానికి కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమీర్, ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నా రు. గతంలో సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటికీ అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా వేశారు. అది సూర్య డ్రీమ్ ప్రాజెక్టు కావటంతో ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందంటూ తాజాగా ఓ టాక్ వినిపిస్తోంది. జల్లికట్టు నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలోని తన పాత్ర కోసం సూర్య జల్లికట్టుపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.