calender_icon.png 31 January, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డెర వృత్తిదారులు ఉద్యమాలకు సిద్ధం కావాలి

31-01-2025 04:54:30 PM

వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టి సాయిలు...

కామారెడ్డి (విజయక్రాంతి): వడ్డెర వృత్తిదారులకు ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలకు సిద్ధం కావాలని వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈడగొట్టి సాయిలు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువానుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయని కానీ వడ్డెర వృత్తిదారుల సంక్షేమం కోసం ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదని అన్నారు. గ్రామాలలో పనులు కోల్పోయి పట్టణాలకు వలసలు వెళుతున్నారు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డెర వృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

కంకర క్వారీలను సొసైటీలకే ఇవ్వాలని బ్యాంకులు ఎలాంటి షరతులు లేకుండా మిషన్లు కొనడానికి రుణాలు సబ్సిడీ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. గీతా చేనేత కార్మికులకు ఇచ్చే విధంగా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు భూమిలేని పేదలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తిదారుల సంక్షేమం కోసం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టి బడ్జెట్లో నిధులు కేటాయించాలని చేతివృత్తిదారులను రక్షించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డిలో వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా క్యాలేండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలయ్య, జిల్లా అధ్యక్షులు నర్సింలు, జిల్లా కార్యదర్శి రాజు, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు రాజన్న రాములు, స్వామి, రాజేందర్, మల్లయ్య, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.