కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్
పటాన్‌చెరు, జనవరి 11 : ప్రజల స్వేచ్ఛ స్వా తంత్రం కోసం వడ్డె ఓబన్న చేసిన పోరాటం మరువ లేనిదని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. వడ్డె ఓబన్న 218వ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని నీలం మధు క్యాంపు కార్యాలయంలో శనివా రం ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి నీలం మధు నివాళులు అర్పించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్య మిత్రుడిగా, ముఖ్య అనుచ రుడిగా, సేనాధిపతిగా వడ్డె ఓబన్న పోరాటం ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సం ఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంజలి దస్తగిరి, బీరంగూడ కృష్ణ, వలేపు వెంకటేశ్, పిట్ల లక్ష్మణ్, రాజ్‌కుమార్, శ్రీను, అభిరామ్, ఈశ్వర్, గోపాల్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.