calender_icon.png 12 January, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డే ఓబన్న జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం

12-01-2025 12:15:07 AM

అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ 

గద్వాల, జనవరి 11 ( విజయక్రాంతి): వడ్డే ఓబన్న జీవితం,స్వాతంత్య్ర పోరాటంలో చేసిన త్యాగం, ధైర్యం ప్రతి ఒక్కరికీ  స్ఫూర్తిదాయకమని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ అన్నారు. శనివారం ఐ.డి.ఓ.సి ఆవరణంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి వేడుకలలో  అదనపు కలెక్టర్  జ్యోతి ప్రజ్వలన చేసి,చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన విలువలు, సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  నర్సింగరావు, ఏవో  వీరభద్రప్ప, బి.సి సంక్షేమ అధికారి రమేష్ బాబు,ఎస్సీ సంక్షేమ అధికారి సరోజ, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వడ్డే ఓబన్న పోరాటం వీరోచితం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి

వనపర్తి:    స్వాతంత్య్ర పోరాటంలో వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం వడ్డె ఓబన్న జయంతి వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో  బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వడ్డే ఓబన్న  చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. వడ్డెర లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

స్వాతంత్య్ర పోరాటంలో వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని, ఓబన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పురపాలక  చైర్మన్ పుట్టపాకుల మహేష్, వడ్డెరల సంఘం జిల్లా నాయకులు దాసర్ల భూమయ్య, తహసిల్దార్ రమేష్ రెడ్డి, వడ్డెర సంఘం నాయకులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.