calender_icon.png 12 January, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డ్డె ఓబన్న పోరాటం.. వీరోచితం

12-01-2025 12:00:00 AM

మెదక్, జనవరి 11 (విజయక్రాంతి) : బ్రిటిష్ వారితో వడ్డె ఓబన్న చేసిన పోరాటం ఎంతో స్పూర్తిదా యకమని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలి పారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న 218వ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రపాల్, సంబంధిత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శ్రీనివాస్ అధికారులు, వడ్డెర సంఘం నాయకులతో కలిపి కలెక్టర్ వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్  ఆయన చరిత్రను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడు తుందని తెలిపారు. వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారింగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.