- దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి రానున్న టిర్జెపెటైడ్ ఇంజెక్షన్
- డయాబెటిస్, వెయిట్‌లాస్‌లో గేమ్ ఛేంజర్‌గా గుర్తింపు
న్యూ ఢిల్లీ, జూలై 15: శరీర బరువు తగ్గించేందుకు భారత మార్కెట్‌లో ఇప్పటికే అనేక మందులు అందుబాటులో ఉ ండగా త్వరలో.. ఈ ఫీల్డ్‌లో గేమ్ ఛేంజింగ్‌గా పిలువడుతున్న టిర్జెపెటైడ్ అనే ఔషధాన్ని ప్రవేశపెట్టనున్నారు. యూర ప్, అమెరికాలో ఇప్పటికే వీటిని వాడుతుండగా.. త్వరలో భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకురావడాని కి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) ఇటీవల ఈ ఔషధ దిగుమతికి ఆమోదం తెలిపింది.
ఈ ఔషధాన్ని ఎల్ లిల్లీ అండ్ కో అనే ఫార్మా కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. జెప్‌బౌండ్, మౌంట్‌జారో పేర్లతో అమ్ముతున్నారు. దీని రసాయనిక నామం టిర్జెపటైడ్. ఇది వాస్తవంగా టైప్x డయాబెటిస్ చికిత్సకు అభివృద్ధి చేయబడింది. మౌంజా రో ఔషధం మధుమేహాన్ని తగ్గించడమే లక్ష్యంగా 2022లో అమెరికాలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో సీడీఎస్‌సీఓ ఆధ్వర్యంలోని సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ(ఎస్‌ఈసీ) టైర్జెపటిడే ఔషధం రెండు రూపాల నియంత్రణ ఆమోదాన్ని ప్రతిపాదించింది.
చర్చల తర్వాత ఈ ఔషధం దిగుమతి మరియు మార్కెటింగ్ కోసం అనుమతి మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. టిర్జెపటైడ్ ఇంజెక్షన్ 72వారాల వ్యవధిలో 18శాతం బరువు తగ్గించింది.