calender_icon.png 29 April, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద వయసులోనూ టీకాలు అవసరం!

29-04-2025 01:28:27 AM

  1. 16 నుంచి 60 ఏళ్ల వరకు తప్పక తీసుకోవాలి
  2. కామినేని ఆస్పత్రి వైద్యుల సూచన

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): టీకాలు ప్రతి ఒక్కరికీ అవసరమని, పెద్ద వయసులో కూడా కొన్ని రకాల టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందని కామినేని ఆస్పత్రి వైద్యనిపుణులు చెప్పారు. కొవిడ్ తర్వాతి కాలంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు వ స్తున్నాయని, వాటన్నింటి నుంచి దీర్ఘకాలం లో రక్షణ పొందాలంటే తప్పనిసరిగా టీకా లు తీసుకోవాలని సూచించారు.

ఏప్రిల్ 24 నుంచి 31 వరకు అంతర్జాతీయ టీకాల వా రోత్సవం సందర్భంగా ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, విభాగాధిపతి డాక్టర్ ఎం స్వామి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ హరికిషన్, కన్సల్టెంట్ జనర ల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకృష్ణ రాఘవేంద్ర బొడ్డు, కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ పటేల్ సోమవారం మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం అనేక కొత్తర కాల ఇన్ఫెక్షన్లు, సమస్యలు వస్తున్నాయి. అలాగే జీవనశైలి వ్యాధుల వల్ల కొందరిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీన్ని దృష్టి లో పెట్టుకుని ప్రతి ఒక్కరూ వైద్యుల వద్దకు వెళ్లి తమకు అవసరమయ్యే టీకాలు తీసుకోవాలన్నారు. ఉన్నత చదువుల కోసం విదేశా లకు వెళ్లేటప్పుడు ఆయా విశ్వవిద్యాలయా లు కొన్ని టీకాలు తప్పనిసరిగా తీసుకుని ఉండాలని చెపుతాయని, అలాంటి విద్యార్థులకు అవసరమయ్యే టీకాలు కూడా వేయిం చుకోవాలన్నారు.

విద్యార్థులు మాత్రమే కాక, అన్ని వయసుల వారికీ రోగనిరోధక శక్తి అత్యవసరమని, కొత్త వ్యాధులు వచ్చినప్పుడు వాటిని నిరోధించడానికే ఈ టీకాలు ఇస్తామని తెలిపారు. మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారికి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు కొత్త ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవి రాకుండా టీకాలు నిరోధిస్తాయన్నారు. అవికాక న్యుమోనియా, ఇన్‌ఫ్లూయెంజా వం టి టీకాలు ఏటా తీసుకోవాలన్నారు. సాధారణంగా 16 ఏళ్ల వరకు 7-8 రకాల టీకాలు ఉంటాయన్నారు. 60 ఏళ్ల తర్వాత ఇన్‌ఫ్లూయెంజా, న్యుమోకోకస్, హె ర్పిస్ జోస్టర్ లాంటి టీకాలు అవసరమన్నారు.